నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గుడిపల్లి గ్రామానికి చెందిన శుభాకర్(20) కూలీ పనులు చేస్తూ హైదరాబాద్లో ఉండేవాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ఎలాంటి పనులు లేకపోవడంతో కొన్ని రోజులుగా స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతను మద్యానికి బానిసై నిత్యం తల్లి ఇస్తారమ్మ(50) తో గొడవ పడేవాడు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. శనివారం మధ్యాహ్నం మద్యం మత్తులో తల్లితో మరోసారి గొడవకు దిగాడు.
మద్యానికి బానిసై కన్నతల్లినే హత్య చేసిన తనయుడు - నాగర్కర్నూల్ జిల్లా తాజా వార్తలు
మద్యానికి బానిసగా మారి కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి తనయుడు. ఈ విషాద ఘటన నాగర్కర్నూల్ జిల్లా గుడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ క్రమంలో తలపై గట్టిగా కొట్టడంతో తల పగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిని కొడుతుండగా అడ్డు వచ్చిన తన అక్కను కూడా కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆమె భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీసి ఇరుగు పొరుగు వారికి విషయాన్ని చెప్పింది. వారు వచ్చేసరికే రక్తపు మడుగులో తల్లి విగత జీవిగా కనిపించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు నాగర్కర్నూల్ సీఐ గాంధీ నాయక్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ స్టీరింగ్ పట్టిన అతివ.. మగవారికి పోటీగా డ్రైవింగ్