నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా ఏఈఓ భాగ్యశ్రీ ఆత్మహత్యాయత్నం చేశారు. ఉదయం తన ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగులమందు తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బోధన్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఏఈఓ ఆత్మహత్యాయత్నం - నేర వార్తలు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా ఏఈఓ ఆత్మహత్యాయత్నం చేశారు. బోధన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న బోధన్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
suiside
బోధన్ మండలం బండారుపల్లికి చెందిన భాగ్యశ్రీ కొన్ని రోజులుగా రెంజల్ మండలం నీలా ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న బోధన్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఒకే రోజు ఒకే ప్రాంతం... మూడు వేర్వేరు ప్రమాదాలు..