ప్రమాదవశాత్తు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. మద్దిరాల మండలం పీర్యాతండాకు చెందిన భూక్య మల్సూర్(60) మామిళ్ల మడువ గ్రామం నుంచి తిరిగి వెళ్తుండగా పాలేరు వాగు దాటే క్రమంలో నీళ్లలో పడి మృతి చెందాడు.
ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి - సూర్యాపేట జిల్లా నేర వార్తలు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పీర్యాతాండ గ్రామానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు పాలేరువాగులో పడి మరణించాడు. వాగు దాటే క్రమంలో నీళ్లలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి
అతని ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా పాలేరు వాగులో మృతదేహం కనిపించింది. మృతుని కుమారుడు భూక్య వెంకన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండిసాయి ప్రశాంత్ తెలిపారు.