తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాగజ్‌నగర్‌ కాగితం పరిశ్రమలో ప్రమాదం.. ఒకరికి గాయాలు - ఉమ్మడి ఆదిలాబాద్‌ వార్తలు

కుమురం భీం జిల్లాలోని ఓ కాగితం పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఒప్పంద కార్మికుడికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Accident in Kagaznagar spm paper industry one Injured
కాగజ్‌నగర్‌ కాగితం పరిశ్రమలో ప్రమాదం.. ఒకరికి గాయాలు

By

Published : Dec 23, 2020, 12:21 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం కాగితపు పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహిస్తోన్న షేక్ జహీర్(42) అనే వ్యక్తికి గాయాలయ్యాయి.

ఎస్పీఎం కాగితపు పరిశ్రమలో ఉదయం షిఫ్ట్​లో విధులు నిర్వహిస్తున్న జహీర్‌పై నిచ్చెన పడిపోయింది. ఈ క్రమంలో అతని ముఖంపై గాయాలయ్యాయి. వెంటనే పరిశ్రమ సిబ్బంది జహీర్‌ను ఈ.ఎస్.ఐ. ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతన్ని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కార్మికుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:24 కి.మీ వెనక్కి దూసుకెళ్లిన ​రైలు- ఆపై బోల్తా

ABOUT THE AUTHOR

...view details