మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో జగదీశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు - జడ్చర్లలో రోడ్డుప్రమాదం వార్తలు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
జడ్చర్లకు చెందిన జగదీశ్, శ్రీకాంత్‌లు ద్విచక్ర వాహనంపై మహబూబ్‌నగర్ వైపు నుంచి జడ్చర్ల వస్తుండగా.. హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో జగదీశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: విద్యుత్ తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి