లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సైజ్ ఎస్సై - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు
16:56 June 10
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సైజ్ ఎస్సై
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కోనరావుపేట మండలం నిజామాబాద్‌లోని వైన్స్ సమీపంలో దాబా అనుమతి కోసం ఎక్సైజ్ ఎస్సై సుస్మిత నిర్వాహకులను 25 వేలు రూపాయలు డిమాండ్ చేశారు. బాధితులు కవ్వంపల్లి సురేశ్, తిరుపతి, సంజీవ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇవాళ సిరిసిల్ల శివారులోని ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో ఎస్సై సుస్మిత కానిస్టేబుల్ రాజు పంపించింది. కానిస్టేబుల్ రూ. 20 వేల లంచం తీసుకున్నాడు.
ఏసీబీ అధికారులను గమనించిన కానిస్టేబుల్ రాజు పరారయ్యాడు. ఎస్సై సుస్మిత, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.
ఇదీ చదవండి:అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్