హెచ్ఎండీఏలోని అటవీ విభాగం అధికారి ప్రకాశ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నానక్ రాం గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో ప్రకాశ్ వద్ద 10 లక్షల 50 వేల రూపాయలు దొరికాయి. ఆయన వాహనంలోనూ 20 వేల రూపాయలను అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత దూలపల్లిలోని ప్రకాశ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన అధికారులు 5 లక్షల 14 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 లక్షల 84 వేల రూపాయలకు ప్రకాశ్ లెక్కలు చూపించలేకపోయాడు. దీంతో అనిశా అధికారులు ప్రకాశ్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.