వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సావిత్రిభాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి వెళ్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
మంత్రి కాన్వాయ్ అడ్డగింత... ఏబీవీపీ నేతలు, పోలీసుల వాగ్వాదం - ఏబీవీపీ ఆందోళన
కాకతీయ వర్సిటీకి ఉపకులపతిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ను అడుకున్న ఏబీవీపీ కార్యకర్తలు
కాకతీయ వర్సిటీకి ఉపకులపతిని నియమించే వరకు విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టవద్దని మంత్రి కాన్వాయ్ ముందు పడుకొని ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:వాడిన కారు.. వారెవ్వా అంటారు!
Last Updated : Jan 3, 2021, 3:28 PM IST