మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు శివారు జయరాం తండాలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో గుగులోతు నవీన్ మృతి చెందాడు. పొలంలో విద్యుత్తీగ తెగిపడడం వల్ల.. కరెంట్ షాక్తో మృత్యువాతపడ్డాడు.
నారుమడిలోనే ప్రాణం పోయింది, విద్యుదాఘాతంతో యువకుడి మృతి - మహబూబాబాద్ జిల్లా నేర వార్తలు
విద్యుదఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలం జయరాం తండాలో జరిగింది. నారుమడిలో విద్యుత్తీగ తెగిపడడం వల్ల విద్యుదఘాతంతో గుగులోతు నవీన్ ప్రాణాలు కోల్పోయాడు.
తండాకు చెందిన గుగులోతు పెద్ద బాబు, భద్రమ్మ దంపతులు నరసింహులు పేట మండలంలోని బొజ్జన్నపేటకు చెందిన ఓ రైతు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. తండ్రికి చేదేడువాదోడుగా ఉంటున్న నవీన్ తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. శుక్రవారం పొలంలో నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులకు వ్యవసాయ మోటారుకు సంబంధించిన తీగ తెగి నారుమడిలో పడింది. దానిని గమనించని నవీన్ మడిలో దిగడం వల్ల విద్యుదాఘాతంతో ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. చేతికందొచ్చిన కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఆటోను ఢీ కొట్టిన కారు.. ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు