వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. గ్రామంలోని 9 వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చిల్పూర్ మండలం దేశాయితండాకు చెందిన భూక్యా లోకేశ్ ( 19 ) అనే యువకుడు రోడ్డు నిర్మాణంలో కూలీ పనులు చేస్తున్నాడు.
రోడ్డు పక్కన ఉన్న ఒక గుడిసె యజమాని అమర్చుకున్న విద్యుత్ ఎర్త్ వైర్ కి లోకేశ్ అనుకోకుండా తగిలాడు. ప్రమాదవశాత్తు ఆ ఎర్త్ వైర్ కి విద్యుత్ ప్రసారం కావడంతో..... విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.