భూ తగాదా కారణంగా ఓ మహిళను ప్రత్యర్థి వర్గం దారుణంగా హత్య చేసిన సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం ఎగువ కన్నికాపురంలో సంచలనం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతులు నారాయణరెడ్డి, విజయ శేఖర్ రెడ్డి కుటుంబాల మధ్య కొంతకాలంగా వ్యవసాయ పొలాల వద్ద దారి విషయమై తగాదాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం పొలంలో ఇరువర్గాలు మరోసారి గొడవ పడ్డాయి.
లైవ్ వీడియో: కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి... మహిళ మృతి - Chittoor district latest crime news
ఏపీలోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎగువ కన్నికాపురం గ్రామంలో దారుణం జరిగింది. పొలం విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం ఓ మహిళ ప్రాణం తీసింది. ఓ కుటుంబంపై ప్రత్యర్థి వర్గం కళ్లలో కారం కొట్టి కిరాతకంగా కత్తులతో దాడి చేశారు.
నారాయణ రెడ్డి కుటుంబం ముందస్తు ప్రణాళికతో విజయ శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులపై కారం చల్లి కత్తితో దాడికి దిగింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన విజయ శేఖర్ రెడ్డి భార్య చంద్రకళను నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కత్తితో నరికారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్సై లోకేశ్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి :అపహరణకు గురైన మూడు నెలల చిన్నారి... కథ సుఖాంతం