నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ మహిళని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. బర్పర గ్రామానికి చెందిన మెయినా 14 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌కి వలస వచ్చింది. మిర్యాలగూడకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను తన భార్య పేరు మీద నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఓటరు కార్డు తీసుకున్నాడు.
బంగ్లాదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో అక్రమ నివాసం.. వ్యభిచారం - hyderabad crime news
హైదరాబాద్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ మహిళని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఓటరు కార్డు పొందిన ఈమె నగరంలో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఉప్పల్‌లో అనుమానాస్పదంగా సంచరించడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెని ఆరా తీశారు.
డబ్బుల కోసం అడ్డదారులను ఎంచుకున్న మెయినా బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొచ్చి వనస్థలిపురం, ఉప్పల్ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తూ మూడేళ్ల క్రితం పోలీసులకు పట్టుబడింది. బెయిల్‌పై బయటికి వచ్చినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఉప్పల్ ఆటోస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఠాణాకి తరలించారు. అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తేలడంతో మెయినాతో పాటు ఆమె భర్తని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:ఈటీవీ భారత్ ప్రత్యేకం.. ఏపీ ఎంసెట్ ర్యాంకర్ల మనోగతం