వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల సమీపంలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని వివాహితను దుండగులు గొంతుకోసి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన నీటి గుంతలో పడేసి వెళ్లారు. నిత్యం వాహనాల రద్దీ ఉండే బీజాపూర్ జాతీయ రహదారిలో ఈ దారుణం జరిగింది.
వికారాబాద్‌లో గుర్తు తెలియని వివాహిత దారుణ హత్య
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల సమీపంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వివాహితను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంతలో పడేసి వెళ్లారు.
వికారాబాద్‌లో గుర్తు తెలియని వివాహిత దారుణ హత్య
మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో మహిళ మృతదేహంతో పాటు రక్తపు మరకలతో ఉన్న దుప్పట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను హత్య చేసి వాహనంలో తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.