దంపతుల మధ్య కలహాలతో.. భార్య ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మల్లికార్జున నగర్లో నివాసముంటున్న రామలక్ష్మి ఇటీవల సంక్రాంతి పండుగకని.. ఏపీ, ఒంగోలులోని తన పుట్టింటికి వెళ్లింది. ఆదివారం నాడు తిరిగి ఇంటికి చేరుకుంది. అనంతరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య
భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో చోటు చేసుకుంది.
బలవన్మరణమా.. భర్తే కారణమా?
మృతురాలి కుటుంబ సభ్యులు.. రామలక్ష్మి భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.