మెదక్ జిల్లా పేట్‌బషీర్‌బాద్ ఠాణా పరిధిలో దారుణం జరిగింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. మరో వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానంతో కిరాతకంగా పొడిచి చంపాడో వ్యక్తి.
భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఓ మహిళ స్థానిక అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. భర్త నుంచి విడాకులు తీసుకుని వారి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో మెదక్‌లోని తమ పక్క ఊరికి చెందిన కృష్ణతో పరిచయం ఏర్పడింది. పోచమ్మ తల్లిదండ్రులు ఊరు వెళ్లినప్పుడల్లా కృష్ణ వస్తుండేవాడు.