సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని సాయిరామ్ కాలనీలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా సింగరాయకొండకు చెందిన రమణయ్య మేస్త్రిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అతని భార్య సుజాతతో మనస్పర్థలు వచ్చాయి.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య - సంగారెడ్డి జిల్లా తాజా సమాచారం
దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని సాయిరామ్ కాలనీలో ఘటన చోటుచేసుకుంది. రెండు రోజులుగా అతని భార్య కనిపించకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
అతని ప్రవర్తనతో విసుగు చెందిన ఆమె కూతురిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయిన రెండు రోజులకు అతను ఉంటున్న ఇంటిలోనే ఇనుప పైపులకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.