మేడ్చల్ జిల్లా బాచుపల్లి నుంచి గండిమైసమ్మ వైపు ఓ టిప్పర్ విధ్వంసం సృష్టించింది. దుండిగల్ పరిధి బౌరంపేటలోని డీఆర్కే కాలేజీ సమీపంలో... యూ టర్న్ తీసుకుంటున్న కారును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీ కొట్టి వెనుక వస్తున్న బైక్కు తగిలింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారునికి గాయాలు కాగా... స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
డీఆర్కే కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం - bowrampet road accident
మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి బౌరంపేటలోని డీఆర్కే కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యూ టర్న్ తీసుకుంటున్న కారును టిప్పర్ ఢీకొట్టింది.
డీఆర్కే కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం
కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. త్రుటిలో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:'అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందే ఉంటుంది'