తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నల్లా దగ్గర లొల్లి.. ఇరువర్గాల ఘర్షణ.. వ్యక్తి మృతి - కరీంనగర్ వార్తలు

నల్లా వద్ద జరిగిన వివాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నీటి పైపు కోసం రెండు కుటుంబాల నడుమ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో అమిరిశెట్టి రాములు మృతి చెందారు.

a-man-died-in-tap-conflict-at-nagunoor-in-karimnagar-rural-mandal
నల్లా వద్ద గొడవ... వ్యక్తి మృతి

By

Published : Jan 16, 2021, 4:27 PM IST

కరీంనగర్ గ్రామీణ మండలం నగునూరు గ్రామంలో నీటి కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందారు. నల్లా పైపు తొలగింపు విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. పైపు ఎందుకు తీశావని మృతుడు అమిరిశెట్టి రాములుతో అమీర్‌ అనే వ్యక్తి గొడవ పడినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈ క్రమంలో అమీర్‌తో పాటు పది మంది కలిసి తన తండ్రిని తీవ్రంగా కొట్టారని మృతుని కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:అర్ధరాత్రి వీధి కుక్కల దాడి... 40 మేకలు మృతి

ABOUT THE AUTHOR

...view details