సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఇసుకబాయిలో వ్యసనాలకు బానిసై ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్బాడు. రాయికోడ్ మండలం ఇటికెపల్లికి చెందిన కాశీనాథ్ గౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాశీనాథ్ మద్యానికి బానిసై, వ్యసనాలకు అలవాటుపడ్డాడు.
వ్యసనాలకు బానిసై వ్యక్తి ఆత్మహత్య - వ్యక్తి ఆత్మహత్య
వ్యసనాలకు బానిసై ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని ఇసుకబాయిలో చోటుచేసుకుంది.
చెడు వ్యసనాలకు బానిసై వ్యక్తి ఆత్మహత్య
ఈ నేపథ్యంలో భార్య, పిల్లలు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉంటుండగా... ఇతను మాత్రం అమీన్‌పూర్ మండలం ఇసుకబాయిలోని ఓ గదిలో ఉంటున్నాడు. గది నుంచి దుర్వాసన రావడం వల్ల ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు తలుపులు తీసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: మద్యంలో శానిటైజర్ కలుపుకొని తాగేశాడు..