తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2020, 5:14 PM IST

ETV Bharat / jagte-raho

ఉద్యోగాల పేరుతో మహిళలను ముంచేశారు.!

నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకున్న కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. కొలువులు ఇప్పిస్తామని చెప్పి లక్షల్లో వసూలు చేశారు. చెప్పాపెట్టకుండా జెండా ఎత్తేశారు.

A GANG CHEATED THE LADIES IN NIRMAL
ఉద్యోగాల పేరుతో మహిళలను ముంచేశారు..

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఓ సంస్థ నిర్వాహకురాలు, ఓ మధ్యవర్తితో కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తొమ్మిది మందిని మోసం చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష పైనే వసూలు చేసింది. కేజీబీవీలో కిచెన్ గార్డెనియన్ ఉద్యోగాలిప్పించి ఏడాదికాలంగా జీతాలు ఇవ్వకుండా జెండా ఎత్తేసింది.

నియామక పత్రాలు అందినా..

2019 జనవరిలో నియామక పత్రాలు అందించి కేజీబీవీలో చేరాలని సూచించింది. అనుకున్న సమయానికి వారంతా కేజీబీవీలో చేరారు. సంవత్సరం గడుస్తున్నా జీతాలు రాకపోయేసరికి సంస్థ నిర్వాహకుల వద్దకు వెళ్లారు. తాము మోసపోయాని తెలుసుకున్న తొమ్మిది మంది మహిళలు పోలీసులను ఆశ్రయించారు.

ఉద్యోగాల పేరుతో మహిళలను ముంచేశారు

ఇవీ చూడండి:2 గంటల వ్యవధిలో యువతిపై ముగ్గురు అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details