ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా స్టీల్‌ప్లాంట్ పవర్‌ప్లాంట్-2లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టర్బైన్ ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన వల్ల 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని స్టీల్‌ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగం వెల్లడించింది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయన్న స్టీల్ ప్లాంట్ సిబ్బంది.. ప్లాంట్ ఉత్పత్తికి విఘాతం కలగలేదని తెలిపారు. అయితే అధికారులు ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాఖ ఉక్కుకర్మాగారంలో అగ్నిప్రమాదం - fire accident in visakha steel plant latest news update
ఏపీలోని విశాఖ ఉక్కుకర్మాగారంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్‌లోని టీపీసీ-2లో మంటలు ఎగసిపడ్డాయి. ఎవరికీ గాయాలు కాలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టీల్‌ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగం వెల్లడించింది.
విశాఖ ఉక్కుకర్మాగారంలో అగ్నిప్రమాదం