ఓ బాలుడు గొంతులో మూత ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడక మృతి చెందాడు. మరో వారం రోజుల్లో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన ఆ చిన్నారికి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయి. ఈ విషాదకర ఘటన ఏపీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ రత్తకన్న ఒడియా వీధిలో జరిగింది.
గీతా దలై అనే మహిళ ప్రసవం కోసం రత్తకన్న ఒడియా వీధిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు లియన్స్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటుంది. ఏడాది కావస్తుండటం వల్ల బిలాయిలో ఉన్న భర్త కుమార్ వద్దకు వెళ్లాలనుకుంది.