తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

57 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్​ - telangana news

పేకాట స్థావరాలపై దాడి చేసి 57 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూకుమ్మడిగా చేసిన దాడిలో రూ. 6లక్షలు, కార్లు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. పేకాట ఆడే వారి విషయంలో ఎంతటి వారినైనా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.

57 poker players arrested in peddapally mancheryal
57 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

By

Published : Feb 10, 2021, 2:14 PM IST

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి.. పేకాట ముఠాను అరెస్ట్ చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను రామగుండం సీపీ వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న కార్లు

"అదిలాబాద్ సరిహద్దు ప్రాణహిత నది అలాగే మహారాష్ట్ర సరిహద్దులో పేకాట స్థావరంపై రామగుండం, మంచిర్యాల టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు నిర్వహించాం. ఈ దాడిలో ముఠాలోని 57 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి రూ. 6లక్షల నగదుతో పాటు 18 వివిధ రకాల వాహనాలు, 63 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. కొందరు కీలక వ్యక్తుల విషయంలో ఆరా తీస్తున్నాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఏజెంట్ల ద్వారా పేకాట ఆడుతున్నట్లు కనుగొన్నాం. పేకాట ఆడే వారి విషయంలో ఎంతటి వారినైనా వదిలేది లేదు".

-- సీపీ సత్యనారాయణ

స్వాధీనం చేసుకున్న ఫోన్లు

పేకాట ఆడుతున్న వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలో అరెస్టైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని సీపీ సత్యనారాయణ తెలిపారు. పేకాటతో కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని హెచ్చరించారు. భవిష్యత్​ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటివాటి జోలికి పోవద్దని సూచించారు. పేకాట ముఠాను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులను సీపీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి, మంచిర్యాల డీసీపీలు రవీందర్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డిలతో పాటు అడ్మిన్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details