గుజరాత్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తెలుగువారు దుర్మరణంపాలయ్యారు. సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుని తిరుగుప్రయాణంలో ఉండగా.. సురేంద్రనగర్ జిల్లా దేవ్ పారా గ్రామ సమీపంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఐదుగురు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలుగువారు మృతి - ap people dead in gujarat accident
గుజరాత్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తెలుగువారు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుని తిరిగివస్తుండగా సురేంద్రనగర్ జిల్లా దేవ్ పారా గ్రామ సమీపంలో వాహనం ప్రమాదానికి గురైంది.
accident in gujarat
మృతులు ప్రకాశం జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన సుబ్రమణ్యం తంబారావ్, రాజశ్రీ సుబ్రమణ్యం, గణేష్ సుబ్రమణ్యం, భవానీ నాగేంద్ర, అఖిల్ ప్రసాద్‌గా గుర్తించారు. గాయపడిన వారిని నాగేంద్ర ప్రసాద్, మాధురి, శ్రీనివాస్, రుచిత, డ్రైవర్ సోహన్గా గుర్తించారు. క్షతగాత్రులు కోలుకుంటున్నారని సమాచారం.
ఇది చదవండి:మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు