తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఖాస్లాపూర్ చెక్​పోస్ట్ వద్ద పట్టుబడిన నగదు - dubbaka news

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు భారీగా పట్టుబడుతోంది. ఖాస్లాపూర్​ చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ కారులో నాలుగు లక్షల 21 వేల నగదు లభ్యమైంది.

ఖాస్లాపూర్ చెక్​పోస్ట్ వద్ద భారీగా పట్టుబడిన నగదు
ఖాస్లాపూర్ చెక్​పోస్ట్ వద్ద భారీగా పట్టుబడిన నగదు

By

Published : Oct 16, 2020, 8:24 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఖాస్లాపూర్ చెక్​పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. నార్సింగ్​ ఎస్సై నాగమణి తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా... రామాయంపేట వైపు నుంచి నార్సింగ్​ వైపు వెళ్తున్న కారులో 4 లక్షల 21 వేలు లభ్యమయ్యాయి.

కారు డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్​ని ప్రశ్నించగా... నగదు నార్సింగ్ గ్రామంలోని ఈశ్వర్​ వైన్స్​కు సంబంధించినవని తెలిపారు. తాను ఆ వైన్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. సరైన ఆధారాలు చూపకపోవటం వల్ల డబ్బును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: దుబ్బాక ఉపఎన్నికకు 46 మంది నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details