జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న శివమణి అనే రెండేళ్ల బాలున్ని నాగుపాటు కాటేసింది. చిన్నారి తల్లిదండ్రులు గుర్తించి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆడుకుంటుండగా కాటేసిన పాము.. చిన్నారి మృతి - died news
ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని నాగుపాము కాటేసింది. చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఆ బాలుడు ప్రాణాలొదిలాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా ముత్యంపేటలో చోటుచేసుకుంది.
నాగుపాము కాటుకు బలైన రెండేళ్ల బాలుడు
చికిత్స అందిస్తున్న క్రమంలో బాలుడు మృతి చెందాడు. అప్పటి వరకు అల్లామురుద్దుగా ఆడుకుంటున్న తన కుమారుడు విగతజీవిగా మారటంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.