సెల్ఫీ మోజులో ఇద్దరు యువకులు చెరువులో పడి నిండు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన శామీర్పేట పెద్ద చెరువు వద్ద చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం సఫీల్గూడ ప్రాంతానికి చెందిన ఆరుగురు స్నేహితులు శ్రీధర్, సుమిత్ కుమార్ సింగ్, ఉజ్వల, మేఘన, మనీశ్(16), ఉత్తేజ్(16) కలిసి శామీర్పేట్ కట్ట మైసమ్మను దర్శనం చేసుకున్నారు.
సెల్ఫీ తీసుకుందామని చెరువులోకి దిగి ఇద్దరు యువకులు దుర్మరణం - 2 boys died in shameerpet lake
స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడుపుదామని వెళ్లారు. ఆ సరదాలను ఫొటోల్లో బంధించుకుని దాచుకుందామనుకున్నారు. కానీ... ఆ సంతోష క్షణాలు వారిని తీరని విషాదంలోకి నెట్టేశాయి. సెల్ఫీ తీసుకుందామని చెరువులో దిగిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట వద్ద చోటు చేసుకుంది.
2 boys died drown in shameerpet lake
అనంతరం నలుగురు యువకులు ఫొటోలు తీసుకుంటామని చెరువులోకి దిగారు. మనీశ్, ఉత్తేజ్ ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఉత్తేజ్ మృతదేహం లభ్యం కాగా... మనీశ్ మృతదేహం కోసం పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: తీసుకున్న డబ్బు ఇవ్వట్లేదని తోటి స్నేహితున్ని హతమార్చారు
Last Updated : Oct 3, 2020, 9:41 AM IST