ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దీపం అంటుకుని శ్రావణి అనే 17 నెలల చిన్నారి మృత్యువాతపడింది.
గ్రామానికి చెందిన శ్రీకాంత్, పల్లవి దంపతుల కూతురు శ్రావణి శనివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా తులసి గద్దె వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు పాప గౌనుకు అంటుకుంది. ఎవరూ చూడకపోవడం వల్ల ఆ మంటల్లో శ్రావణి పూర్తిగా కాలిపోయింది.