తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సరదాగా ట్రాక్టర్​పై వెళ్లిన బాలుడు మృత్యు ఒడిలోకి... - nizamabad news

ఇంట్లో ఖాళీగా ఉండలేక తమ ట్రాక్టర్​పై సరదాగా వెళ్లిన ఆ బాలున్ని మృత్యువు మింగేసింది. ఇసుక రవాణా చేస్తున్న తమ వాహనంపై ఇతర గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా... అదే వాహనం తిరగబడి బాలుని ఊపిరి తీసేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లితండ్రులకు కడుపుకోత మిగిల్చింది.

14 years boy died in tractor accident
14 years boy died in tractor accident

By

Published : Sep 6, 2020, 8:29 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్​ (14)... వరుసకు సోదరుడయ్యే కపిల్ (13)తో కలిసి తమ ట్రాక్టర్​పై వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా బండారుపల్లి శివారులో డ్రైవర్ అశోక్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో రెండు వాహనాలు రోడ్డు పక్కన కిందకు పడిపోయాయి. ట్రాక్టర్ ఇంజన్ భాగం మహేశ్​పై పడగా... తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రున్ని నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు విగతజీవిగా మారటంతో గుండెలవిసేలా రోధించారు. ఈ ప్రమాదంలో కపిల్, డ్రైవర్, ద్విచక్ర వాహనదారులు శంకర్, నయీం గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని బోధన్ గ్రామీణ సీఐ రవీందర్ నాయక్ తెలిపారు.

సరదాగా ట్రాక్టర్​పై వెళ్లిన బాలుడు మృత్యు ఒడిలోకి...

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

ABOUT THE AUTHOR

...view details