బాలికకు ఏడో నెలలోనే ప్రసవం చేసిన తల్లి... తల్లీశిశువు మృతి - తల్లీ శిశువు మృతి
17:17 October 12
బాలికకు ఏడో నెలలోనే ప్రసవం చేసిన తల్లి... తల్లీశిశువు మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల తన కూతురు గర్భం దాల్చిందని... ఏడు నెలలో ఇంట్లోనే ప్రసవం చేసేందుకు ప్రయత్నించింది. అది కాస్తా వికటించి శనివారం రాత్రి తల్లి, కూతురు మృతి చెందారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం మృత దేహాలను పూడ్చిపెట్టారు. విషయం బయటికి తెలియడం వల్ల ఆదివారం రాత్రి మున్సిపల్ అధికారులు స్థానిక పోలీసులకు తెలిపారు. సోమవారం తహసీల్దార్ ఆధ్వర్యంలో పూడ్చిన మృతదేహాలను బయటకు తీసి పంచనామా నిర్వహించారు.
ఇదీ చూడండి :సూపర్ మార్కెట్లో మహిళ.. నిత్యావసరాలు దోచేసింది