తెలంగాణ

telangana

హత్య కేసులో పది మంది నిందితుల అరెస్ట్​

By

Published : Aug 6, 2020, 9:59 PM IST

పొలం గట్టు గొడవలో ఓ వ్యక్తిని చంపిన పది మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.

10 members  Accuseds arrest in mahabubabad district
హత్య కేసులో నిందితుల అరెస్ట్​

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రౌతుగూడెంలో ఈ నెల 3న గుగులోతు బాలు కొడుకు రవి పొలాన్ని ట్రాక్టర్​తో దమ్ము చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న అంగోత్ హథీరాంకు చెందిన పొలం గట్టుకు ట్రాక్టర్ రోటోవేటర్ తగిలి గట్టు ధ్వంసమయింది.

ఆగ్రహానికి లోనైన హాథిరామ్ కుటుంబ సభ్యులు బాలును తీవ్రంగా కొట్టడం వల్ల మృతి చెందాడు. బాలు హత్యతో సంబంధం ఉన్న హాథిరామ్ కుటుంబానికి సంబంధించిన 10 సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.

ఇదీ చూడండి:-ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు

ABOUT THE AUTHOR

...view details