తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రౌడి షీటర్ హత్య కేసులో 10 మంది అరెస్ట్

రౌడి షీటర్​ శానుర్​ హత్య కేసులో టాస్క్​ఫోర్స్​ పోలీసులు 10 మందిని అరెస్ట్​ చేశారు. అందులో ఓ మైనర్​ ఉన్నట్లు తెలిపారు. వారిని రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.

10 arrested in rowdy sheeter murder case10 arrested in rowdy sheeter murder case10 arrested in rowdy sheeter murder case10 arrested in rowdy sheeter murder case10 arrested in rowdy sheeter murder case10 arrested in rowdy sheeter murder case10 arrested in rowdy sheeter murder case10 arrested in rowdy sheeter murder case10 arrested in rowdy sheeter murder case10 arrested in rowdy sheeter murder case
10 arrested in rowdy sheeter murder case

By

Published : Jul 24, 2020, 10:55 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలో కాలపత్తర్​ పీఎస్​ పరిధిలో ఈనెల 19, 20 తేదీ అర్ధరాత్రి జరిగిన శానుర్​ హత్య కేసులో ఓ మైనర్​ బాలుడితో సహా మొత్తం 10 మందిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు కత్తులు, 2 ద్విచక్రవాహనాలు, 5 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రౌడి షీటర్ హత్య కేసులో 10 మంది అరెస్ట్

అరెస్ట్​ అయిన మహమ్మద్​ ఆర్బాజ్​ అనే ప్రధాన నిందితుడు హత్యకు గురైన శానుర్​ రౌడి షీటర్​ మధ్య పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలిపారు.

ఈనెల 19, 20 తేదీ మధ్యరాత్రి శానుర్​ ఇంటి వద్ద ఉండగా.. ఆర్బాజ్​ అతని సహచరులతో కలిసి కళ్లలో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేసి పారిపోయారు. రక్తపు మడుగులు ఉన్న శానుర్​ను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా... అదే రాత్రి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఇవాళ 10 మందిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:కరోనా సోకిందని తలుపులకు స్టీల్​ రేకులతో సీల్​!

ABOUT THE AUTHOR

...view details