కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు చింతకుంటలోని శాంతి నగర్ సమీపంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. కొందరు వ్యక్తులు బెట్టింగ్లు చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశారు. నిందితుల నుంచి రూ.22వేల నగదు స్వాధీనం చేసుకొని ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. సద్దాం, వేణుగోపాల్, రఫిక్, జహంగీర్, శ్రావణ్, రాజ్ కుమార్, రమేష్, కన్నాల రాజులపై కేసు నమోదు చేశారు. వీరంతా శాంతినగర్కి చెందిన వారేనని పోలీసులు గుర్తించారు.
కరీంనగర్లో క్రికెట్ బెట్టింగ్... 8 మంది అరెస్ట్ - కరీంనగర్ తాజా వార్తలు
కరీంనగర్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే 8మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.22వేలను స్వాధీనం చేసుకున్నారు. యువత చెడు అలవాట్లకు బానిస కావొద్దని సీపీ కమలాసన్ రెడ్డి సూచించారు.
కరీంనగర్లో క్రికెట్ బెట్టింగ్... 8 మంది అరెస్ట్
అనంతరం కొత్తపెల్లి పోలీసులకు అప్పగించారు. యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని, క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.ప్రకాశ్, కె.శశిధర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఎస్సై పి.కరుణాకర్, యన్. నరేష్ రెడ్డి, బి స్వామి, కొత్తపల్లి ఎస్సై ఎల్లయ్య గౌడ్, నర్సయ్య, టాస్క్ఫోర్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:విషాదం.. గొంతులో మూత ఇరుక్కుపోయి బాబు మృతి