తెలంగాణ

telangana

ETV Bharat / international

ముంబయి పేలుళ్ల సూత్రధారికి 32 ఏళ్ల జైలు శిక్ష - హఫీజ్‌ సయీద్‌ న్యూస్​

Mumbai Blast Hafiz Saeed Sentence: 2008 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు 32 ఏళ్ల జైలుశిక్ష విధించింది పాకిస్థాన్‌ యాంటీ టెర్రరిజం కోర్టు. శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా కట్టాలాని తీర్పునిచ్చింది. హఫీజ్​ ఆస్తులను కూడా స్తంభింపజేయాలని ఆదేశించింది.

Hafiz Saeed Sentence
ముంబయి పేలుళ్ల సూత్రధారికి 32 ఏళ్ల జైలు శిక్ష

By

Published : Apr 8, 2022, 8:03 PM IST

Mumbai Blast Hafiz Saeed Sentence: ముంబయి దాడుల సూత్రధారి, జమాత్ -ఉద్‌-దవా చీఫ్ హఫీజ్‌ సయీద్‌కు 32 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఉగ్రవాదులకు నిధుల మళ్లింపునకు సంబంధించిన రెండు కేసుల్లో పాకిస్థాన్‌ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. ఒక కేసులో 15.5 సంవత్సరాలు, మరో కేసులో 16.5 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ.3,40,000 జరిమానా విధించిన కోర్టు.. అతడికి చెందిన ఆస్తులు స్తంభింపజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. హఫీజ్‌ సయీద్‌ నిర్మించిన మసీదు, మదర్సాను పాక్‌ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. 2008లో జరిగిన ముంబయి ఉగ్ర దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన సూత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని కేంద్రం పలుమార్లు కోరినప్పటికీ పాక్‌ తిరస్కరిస్తూ వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details