తెలంగాణ

telangana

ETV Bharat / international

'తాలిబన్లు కట్టుబడి ఉంటేనే సేనల ఉపసంహరణ' - తాలిబన్లు

అమెరికా, తాలిబన్ల మధ్య ఖతార్​ రాజధాని దోహాలో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశాయి అమెరికా, అఫ్గానిస్థాన్​. ఒప్పందానికి తాలిబన్లు కట్టుబడి ఉంటే 14 నెలల్లో అమెరికా సేనలను అఫ్గానిస్థాన్​ నుంచి ఉపసంహరించుకుంటామని తెలిపాయి.

DOHA ACCORD
దోహా ఒప్పందం

By

Published : Feb 29, 2020, 6:52 PM IST

Updated : Mar 2, 2020, 11:44 PM IST

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా, దాని మిత్రదేశాల బలగాలను ఉపసంహరించుకుంటామని వాషింగ్టన్​, కాబూల్ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అయితే దోహాలో సంతకం చేయబోయే ఒప్పందానికి తాలిబాన్లు కట్టుబడి ఉంటే.... 14 నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపాయి.

ఒప్పందంపై సంతకం చేసిన 135 రోజుల్లోపు.. 8,600 బలగాలను తొలి విడతలో తగ్గిస్తామని వెల్లడించాయి. ఆ తర్వాత మిగతా సేనలను 14 నెలల్లోపు ఉపసంహరించుకుంటామని ఈ ప్రకటనలో తెలిపాయి.

ప్రభుత్వంతో చర్చలకు ఒప్పుకోవడం సహా పలు భద్రతా కట్టుబాట్లకు అంగీకరించనందుకు ప్రతిఫలంగా.. 18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్‌లో మోహరించిన సైన్యాన్ని దశల వారీగా ఉపసంహరించడం ఈ దోహా ఒప్పందం ప్రధాన ఉద్దేశం.

వేదికకు చేరుకున్న ప్రతినిధులు..

దోహాలో జరుగుతున్న ఒప్పంద కార్యక్రమ వేదికకు రెండు పక్షాలకు చెందిన ప్రతినిధులు చేరుకున్నారు. అమెరికా నుంచి విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో ఈ ఒప్పందాన్ని పర్యవేక్షిస్తారు. తాలిబన్​ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదార్​ హాజరయ్యారు. దోహా ఒప్పందంపై అమెరికా, తాలిబన్లు సంతకం చేశాయి.

Last Updated : Mar 2, 2020, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details