తెలంగాణ

telangana

ETV Bharat / international

అత్యంత ఖరీదైన గుర్రపు పందెం.. ఎక్కడంటే? - సౌదీ అరేబియా గుర్రపు పందెం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుర్రపు పందేలు నిర్వహించడానికి సమాయత్తమైంది సౌదీ అరేబియా. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజేతలకు ఏకంగా 20 మిలియన్ల డాలర్లు అందించనుండటం వల్ల ఈ పోటీలపై మరింత ఆసక్తి పెరిగింది.

Saudi Arabia to host world's richest horse race
అత్యంత ఖరీదైన గుర్రపు పందెం.. ఎక్కడంటే..?

By

Published : Feb 26, 2020, 4:23 PM IST

Updated : Mar 2, 2020, 3:41 PM IST

ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుర్రపు పందేలకు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ వారంలో జరగనున్న పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి మొత్తం 20 మిలయన్ల డాలర్ల నగదు బహుమతులను అందించనున్నారు. విజేతకు 10 మిలియన్​ డాలర్లు, రెండో బహుమతి కింద 3.5 మిలియన్​ డాలర్లు ఇవ్వనున్నారు. పదో స్థానంలో నిలిచిన వారికి కూడా ఎంతో కొంత నగదను అందజేయనున్నారు.

1,800 మీటర్ల పందెం..

సౌదీ కప్​ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు సుమారు 10 వేల మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. ఈనెల 29న కింగ్​ అబ్దుల్ అజీజ్​ రేస్ ట్రాక్ వద్ద 1,800 మీటర్ల మేర పందేలు జరగనున్నాయి. సౌదీ కప్​ ఆధ్వర్యంలోనే మరో ఏడు రేసులు నిర్వహించనున్నారు. అందులో 9.2 మిలియన్​ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నారు.

"దేశీయ గుర్రపు పందెం పోటీలను అంతర్జాతీయ ప్రత్యర్థులతో సమానంగా తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు మొదటి అడుగు వేశాం. సౌదీ అరేబియాలో క్రీడల ప్రాముఖ్యాన్ని పెంచేందుకు, పందెంలో దేశ ప్రత్యేకతను చాటుకోవడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నాం. "

-టామ్​ ర్యాన్, జాకీ క్లబ్‌ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ రేసింగ్ డైరెక్టర్

ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుర్రపు పందేలుగా చెప్పుకునే యూఎస్​ పెగసావ్​ ప్రపంచ కప్​, దుబాయ్​ ప్రపంచకప్​లు ఒక నెల వ్యత్యాసంలో జరిగాయి. పెగసాస్ ప్రపంచ కప్​లో 16 మిలియన్ డాలర్లు, దుబయ్ ప్రపంచ కప్‌లో 12 మిలియన్ డాలర్లను బహుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆ రికార్డ్​ను సౌదీ కప్​ పోటీలు అధిగమించనున్నాయి.

రేసులో పేరున్న జాకీలు..

సౌదీ కప్​లో పేరున్న పెద్ద జాకీలు పాల్గొంటున్నారు. ఇటాలియన్​ లెజెండ్ ఫ్రాంకీ డెటోరి, బ్రిటన్​కు చెందిన ర్యాన్ మూర్​. సౌదీ అరేబియాలో తొలి మహిళా జాకీగా పేరుగాంచిన నికోలా క్యూరీ పోటీలో స్వారీ చేయనున్నారు.

ఇదీ చదవండి:కరోనా: చైనాలో 2,715కు చేరిన మృతుల సంఖ్య

Last Updated : Mar 2, 2020, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details