జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఈసారి వర్చువల్‌గా జరగనుంది. నవంబర్‌లో జరిగే ఈ సమావేశానికి సౌదీ అరేబియా వేదిక కానుంది.
సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన నవంబర్ 21, 22న ఈ సదస్సు ఉంటుందని సౌదీ అరేబియా తెలిపింది. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడం, మహమ్మారి వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేయడం అనే అంశాలపై ఈ సదస్సు కొనసాగుతుందని తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తిలో జీ-20 దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది.
తొలుత రియాద్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియా భావించింది. సదస్సుకు రానున్న వివిధ దేశాల సారథులకు స్వాగత సత్కారాలు అందించాలని సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అనుకున్నారు. కానీ, కరోనా ప్రభావంతో ఈ ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి.