జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్.. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశమయ్యారు. సౌదీ పర్యటనలో భాగంగా యువరాజుతో భేటీ అయి కశ్మీర్ అంశంపై చర్చించారు డోభాల్.
ఇరువురి మధ్య సమావేశం సుమారు 2గంటల పాటు సాగినట్లు తెలుస్తోంది. కశ్మీర్ అంశంలో భారత్ అనుసరిస్తున్న తీరును యువరాజు సమర్థించినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. దీనివల్ల కశ్మీర్ అంశంలో సౌదీ తమకు మద్దతుదారుగా ఉండాలని కోరుకుంటున్న పాకిస్థాన్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల మధ్య బంధాల బలోపేతం ఉద్దేశంతో డోభాల్ సౌదీ పర్యటనకు వెళ్లారు. యువరాజుతో ద్వైపాక్షిక బంధాలపైనా చర్చించారు డోభాల్. సౌదీ భద్రతా సలహాదారుతోనూ సమావేశం నిర్వహించారు.