తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాక్​లో మరోసారి అమెరికా దాడి.. ఐదుగురి మృతి

ఇరాక్​లో ఇరాన్​ అనుకూల ఉగ్రవాద సంస్థ కమాండర్​ వాహన శ్రేణి లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో రెండు కార్లు దగ్ధమవగా.. ఐదుగురు ఉగ్రవాదులు మరణించారని ఇరాక్​ అధికార వర్గాలు తెలిపాయి.

IRAQ-HASHED-US-STRIKE
IRAQ-HASHED-US-STRIKE

By

Published : Jan 4, 2020, 8:46 AM IST

ఇరాక్‌లో అమెరికా వైమానిక దాడులు రెండోరోజూ కొనసాగాయి. ఇరాన్‌ అనుకూల ఉగ్రవాద సంస్థ కమాండర్‌ హషీద్ అల్​ షాబి వాహన శ్రేణి లక్ష్యంగా ఉత్తర ఇరాక్‌లో అగ్రరాజ్యం రాకెట్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు ఇరాక్‌ సైన్యం ప్రకటించింది.

ఖుద్స్​ ఫోర్స్​ కమాండర్​ ఖాసీం సులేమాని అంత్యక్రియల నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిపై రాకెట్లతో దాడి చేసినట్లు ఇరాక్​ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో రెండు కార్లు మంటల్లో కాలిపోయాయి. దాడిలో మరణించిన ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉందని ఇరాక్‌ సైన్యం పేర్కొంది.

ఇదీ చూడండి: ట్రంప్​కే నేరుగా హెచ్చరికలు.. అసలు ఎవరీ సులేమానీ?

ABOUT THE AUTHOR

...view details