తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజాపై ఇజ్రాయెల్​ దాడులు- 42 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్​ బలగాలు ఆదివారం జరిపిన దాడుల్లో 42 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. మూడు భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకు ఇరు పక్షాల మధ్య జరిగిన దాడుల్లో ఇదే అత్యంత భీకరమైన దాడిగా అధికారులు పేర్కొన్నారు.

Israeli airstrikes
ఇజ్రాయెల్​, గాజా ఘర్షణలు

By

Published : May 16, 2021, 3:25 PM IST

Updated : May 17, 2021, 7:46 AM IST

ఇజ్రాయెల్​ బలగాలు, గాజాలోని హమాస్​ ఉగ్రవాదుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్​ జరిపిన వైమానిక దాడితో గాజాలో ఆదివారం 42 మంది మృతి చెందారు. ఇందులో 12 మంది మహిళలు. మూడు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇంత భారీ స్థాయిలో విధ్వంసం జరగటం ఇదే ప్రథమం.

ఈ దాడిలో మరో 50 మంది వరకు గాయపడ్డారని గాజా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. అంతకుముందు హమాస్​ ఉగ్రవాద నాయకుల నివాసాలను బాంబులతో ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం​ పేర్కొంది.

కొనసాగుతున్న మరణకాండ..

ఇజ్రాయెల్​ జరిపిన వైమానిక దాడుల వల్ల తమ వారు 20 మంది చనిపోయారని హమాస్​ ఉగ్రసంస్థ ప్రకటించింది. అయితే.. ఈ మరణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని ఇజ్రాయెల్​ చెబుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్​ దాడుల్లో 55 మంది చిన్నారులు, 33 మంది మహిళలు సహా.. 188 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. హమాస్​ దాడుల్లో ఐదేళ్ల చిన్నారి, ఓ సైనికుడు సహా 8 మంది పౌరులు చనిపోయారు. గత సోమవారం నుంచి ఇజ్రాయెల్​పై హమాస్​ ఉగ్రవాదులు 500లకు పైగా రాకెట్లను ప్రయోగించారు.

మరోవైపు.. పాలస్తీనా, ఇజ్రాయెల్​ల మధ్య కొనసాగుతున్న సంక్షోభంపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం సమావేశం కానుంది.

ఇవీ చూడండి:

Last Updated : May 17, 2021, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details