చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. తెగిపడ్డ శరీర భాగాలు.. ముక్కలు ముక్కలైన వాహనాలు.. శిథిలాలుగా మారిన భవనాలు... సరిగ్గా నెల క్రితం లెబనాన్ రాజధాని బీరుట్‌లో పరిస్థితి ఇది. ఆ భయానక ఘటన మరువక ముందే బీరుట్ ఓడరేవులో 4 టన్నుల అమోనియం నైట్రేట్‌ను ఆ దేశ సైన్యం గుర్తించింది.
తమకు వచ్చిన సమాచారం మేరకు లెబనాన్ సైన్యం ఓడరేవులో తనిఖీలు చేపట్టింది. దాదాపు 4.35 టన్నుల ప్రమాదకర రసాయనాలున్న కంటైనర్లను గుర్తించింది. వీటిని ఓడరేవు నుంచి ఎవరూ లేని ప్రాంతాలకు జాగ్రత్తగా తరలించినట్లు సైన్యం తెలిపింది. అయితే ఈ కంటైనర్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలియాల్సి ఉంది.