తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు - ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట

కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థను గాడి పెట్టేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదంటూ నిరసన బాట పట్టారు ఇజ్రాయెల్​ వాసులు. 'ప్రభుత్వం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఈ పాలన పట్ల విసుగుచెందాం' అంటూ నినాదాలు చేశారు.

Israelis protest against 'out of touch' government
ఇజ్రాయెల్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

By

Published : Jul 19, 2020, 6:09 PM IST

ఇజ్రాయెల్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు ఆ దేశ ప్రజలు. కరోనా మహమ్మారి వల్ల ఆర్ధిక సంక్షోభం ఏర్పడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందంటూ టెల్ అవీవ్‌లో ఆందోళనకు దిగారు.

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

కరోనా సంక్షోభం వల్ల నష్టపోయిన వందలాది కార్మికులకు, వ్యాపార సంస్థల యజమానులకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టెల్ అవీవ్‌తో పాటు జెరూసలేం, ఇతర ప్రధాన నగరాల్లోనూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.

ఇజ్రాయెల్​ వాసుల నిరసన
నిరసనలు చేస్తున్న ప్రజలు

ఆందోళనకారులను చెదరగొట్టెందుకు పోలీసులు వారిపై జలఫిరంగులను ప్రయోగించారు.

ప్రభుత్వానికిి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన

ఇజ్రాయెల్​లో ఇప్పటి వరకు దాదాపు 50 వేల మంది మహమ్మారి బారిన పడ్డారు. 400 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:ఓలి 'శ్రీ రాముని' వ్యాఖ్యలపై ఢాకాలో నిరసనలు

ABOUT THE AUTHOR

...view details