తెలంగాణ

telangana

ETV Bharat / international

'యే దోస్తీ' పాటతో ఇజ్రాయెల్​ ఫ్రెండ్​షిప్​ డే విషెష్​ - స్నేహితుల దినోత్సవాన్ని

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్​కు ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది ఇజ్రాయెల్​. బాలీవుడ్​ సూపర్​ హిట్​ పాట 'యే దోస్తీ'తో ఇరు దేశాల ప్రధానుల చిత్రాలు ఉన్న వీడియో సందేశాన్ని పంపింది.  బదులుగా.. రెండు దేశాల బంధం బలమైంది, శాశ్వతమైంది అని ట్వీట్​ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

'యే దోస్తీ' పాటతో ఇజ్రాయెల్​ ఫ్రెండ్​షిప్​ డే విషెష్​

By

Published : Aug 4, 2019, 10:24 PM IST

భారత్​కు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది ఇజ్రాయెల్​. బాలీవుడ్​లో ప్రాచుర్యం పొందిన పాట 'యే దోస్తీ'తో ట్విట్టర్​లో సందేశాన్ని పంపించింది. ఇందులో ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమన్​ నేతన్యాహూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు సమావేశాల్లో కలుసుకున్న చిత్రాలు ఉన్నాయి. భారత్​తో ఇజ్రాయెల్​కు ఉన్న బంధాన్ని తెలిపేలా వీడియోను రూపొందించారు.

ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం కావాలని కోరుతూ ట్వీట్​ చేసింది భారత్​లోని ఇజ్రాయెల్​ దౌత్య కార్యాలయం.

" భారత్​కు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు​. మన స్నేహం మరింత దృఢమవ్వాలి. ఇరు దేశాల భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరాలి. "

- ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం ట్వీట్​​.

మోదీ ధన్యవాదాలు...

ఇజ్రాయెల్​కు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇజ్రాయెల్​ యూదుల భాషలో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

మోదీ ట్వీట్​

" ధన్యవాదాలు, ఇజ్రాయెల్​ ప్రజలు, నా స్నేహితుడు ప్రధాని బెంజమన్​ నేతన్యాహూకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. భారత్​, ఇజ్రాయెల్​ బంధం బలమైంది, శాశ్వతమైంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలి."

- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి.

ప్రధాని మోదీ, నేతన్యాహూ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరువురి మధ్య ద్వైపాక్షిక భేటీల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. సెప్టెంబర్​లో ఇజ్రాయెల్​ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత పర్యటనకు రానున్నారు నేతన్యాహూ.

ఇదీ చూడండి: కశ్మీర్​పై పాక్ ప్రధాని ఇమ్రాన్​ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details