ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను.. నూతనంగా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ తొలగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ. టెహ్రాన్ అణు ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రపంచశక్తులతో చేరేందుకు ప్రయత్నస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడి 2017 జనవరి 20 ముందు నాటికి చేరుకుంటాయన్నారు. తద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు రౌహానీ. ట్రంప్ పాలనలో ఇరాన్‌పై.. అమెరికా అనుసరించిన తప్పుడు విధానాల వల్ల గడిచిన నాలుగేళ్లలో తీవ్ర నష్టం జరిగిందని, దానికి పరిహారం చెల్లించాలని అన్నారు.