తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఆర్మీ పోస్ట్​పై దాడికి ఇరాన్​ కుట్ర! - ఫోర్ట్​ మెక్​నెయిర్

ఇరాన్​ సైనిక ఉన్నతాధికారి జనరల్​ సులేమానీ హత్యకు ఆ దేశం ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికాలోని సైనిక స్థావరంపై దాడికి, ఆర్మీ ఉప ప్రధానాధికారి హత్యకు ఇరాన్​ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

By

Published : Mar 22, 2021, 5:25 AM IST

అమెరికా రాజధాని వాషింగ్టన్​లోని ఫోర్ట్​ మెక్​నెయిర్​ సైనిక స్థావరంపై దాడికి, ఆ దేశ సైనిక ఉప ప్రధానాధికారి జనరల్​ జోసెఫ్​ ఎం మార్టిన్​ను హత్య చేయడానికి ఇరాన్​ కుట్ర పన్నుతున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు. 2000లో యెమన్​లో అమెరికా నౌకాదళానికి చెందిన యూఎన్​ఎస్​ కోల్​పై జరిగిన తరహాలో ఆత్మాహుతి దాడిని పునరావృతం చేయాలని ఇరాన్​ సైన్యంలోని సుశిక్షిత రివల్యూషనరీ గార్డ్​ దళం కుట్ర పన్నుతున్నట్లు ఈ నిఘా సమాచారం సూచిస్తోంది.

అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్​, జాతీయ భద్రతా సంస్థ(ఎన్​ఎస్​ఏ) దీనిపై స్పందించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

ప్రతీకారంగానే..

గతేడాది జనవరిలో ఇరాన్​కు చెందిన సైనిక ఉన్నతాధికారి జనరల్​ సులేమానీని అమెరికా హత్య చేసినందుకు ప్రతీకారంగా ఇలాంటి దాడులకు దిగాలని ఇరాన్​ తలపోస్తోంది. మార్టిన్​ను హత్య చేయడమే కాకుండా ఫోర్ట్​ మెక్​ నెయిర్​ స్థావరంలోకి తన సిబ్బందిని అక్రమంగా చొప్పించి, రహస్యంగా సమాచారాన్ని సేకరించాలని కూడా భావిస్తోంది. ఈ సైనిక స్థావరంలోనే మార్టిన్​ నివాసం కూడా ఉంది.

ఇదీ చూడండి: ఇరాక్​లోని అమెరికా స్థావరాలపై దాడి

ABOUT THE AUTHOR

...view details