తెలంగాణ

telangana

ETV Bharat / international

యురేనియం నిల్వలు పెంచుతాం: ఇరాన్ - ఉల్లంఘన

ప్రపంచ దేశాలతో చేసుకొన్న టెహ్రాన్​ అణు ఒప్పందంలో భాగంగా విధించిన యురేనియం నిల్వల పరిమితిని వచ్చే 10 రోజుల్లో పెంచనున్నట్లు ఇరాన్​ ప్రకటించింది. 20 శాతం వరకు తమ దేశానికి యురేనియం అవసరం ఉందని తెలిపింది.

ఇరాన్ పంచ్​: యురేనియం నిల్వల పరిమితికి స్వాహా

By

Published : Jun 17, 2019, 7:17 PM IST

ఇరాన్​- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో తాజాగా ఇరాన్ టెహ్రాన్​ అణు ఒప్పందానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో విధించిన యురేనియం నిల్వల పరిమితిని 10 రోజుల్లో పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్​ అణుశక్తి విభాగం ప్రతినిధి కామల్​వండి ఈ ప్రకటన చేశారు.

ఒమన్​ సమీపంలోని రెండు చమురు నౌకలపై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ఇరాన్​దే బాధ్యత అంటూ అగ్రరాజ్యం నిందిస్తోంది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఇరాన్.

తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయకపోతే 2015 అణు ఒప్పందంలోని కొన్ని అంశాలను ఉల్లంఘిస్తామని... పరిమితికి మించి యురేనియం నిల్వ చేస్తామని గతంలోనే హెచ్చరించింది. ​హెచ్చరిక ప్రకారం 10 రోజుల్లో పరిమితికి మించి యురేనియంను నిల్వ చేస్తామని ప్రకటించింది ఇరాన్.

అణు విద్యుత్​ కేంద్రాల కోసం యురేనియం అవసరమని.. కనుక ఒప్పందం ఉల్లంఘిస్తున్నామని తెలిపింది.

ఇదీ నేపథ్యం?

ఇరాన్​ వివాదాస్పద అణు కార్యక్రమాలను ఆపేలా 2015లో ఒప్పందం కుదిరింది. ఈ ఒడంబడికలో అమెరికాతో పాటు బ్రిటన్​, ఫ్రాన్స్​, రష్యా, చైనా, జర్మనీ భాగస్వాములు. ఒప్పందం ప్రకారం.. ఇరాన్​ అణు కార్యక్రమాలపై పరిమితులు విధించారు. వాటికి లోబడి ఇరాన్​ వ్యవహరిస్తే ఆ దేశంపై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్ ఎన్నికయ్యాక ఒప్పందంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదో చెత్త ఒప్పందమంటూ గతేడాది వైదొలిగిన అమెరికా... ఇరాన్​పై ఆంక్షలను పునరుద్ధరించింది. ఈ చర్య ఇరాన్​ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. ఈ ఏకపక్ష చర్యపై ఇరాన్ అభ్యంతరం తెలిపింది. ఒప్పందానికి లోబడి వ్యవహరించినా... ఆంక్షలు పునరుద్ధరించటాన్ని వ్యతిరేకించింది.

ABOUT THE AUTHOR

...view details