నతాంజ్‌లోని ఆధునాతన అణు కర్మాగారంపై జరిగిన దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ దాడికి సమాధానమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్ ఖతిబ్జదే పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దారిలోనే వారికి సమాధానం చెబుతామని అన్నారు. అణు కర్మాగారంలోని ఐఆర్-1 సెంట్రిఫ్యూజ్‌లు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం ఇవ్వలేదు.
మరోవైపు, నతాంజ్ అణు కర్మాగారాన్ని పునర్నిర్మిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావెద్ జరీఫ్ స్పష్టం చేశారు. యురేనియంను మరింత వేగంగా శుద్ధి చేసే అధునాతన యంత్రాలతో కర్మాగారాన్ని తీర్చిదిద్దుతామని హెచ్చరించారు.
"ఆంక్షలు ఎత్తివేసే దిశగా ఇరాన్ ప్రజలు సాధించిన విజయానికి వ్యతిరేకంగా జియోనిస్టులు(ఇజ్రాయెల్ మద్దతుదారులు) ప్రతికారం తీర్చుకోవాలనుకుంటున్నారు. కానీ దాన్ని మేం అనుమతించం. జియోనిస్టుల చర్యలకు ప్రతికారం తీర్చుకుంటాం."
-మహమ్మద్ జావెద్ జరీఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి
మరోవైపు, అణు కేంద్రం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఇరాన్ పౌర అణు కార్యక్రమ అధిపతి అక్బర్ సలేహి తెలిపారు. దాడి జరిగినప్పటికీ.. ఇక్కడ యురేనియం శుద్ధి నిలిచిపోలేదని పేర్కొన్నారు.
దాడి తర్వాత మంటలు