భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త బన్సారీలాల్ అరేందీ(50).. అఫ్గానిస్థాన్ కాబుల్‌లోని(kabul news) గన్‌పాయింట్ వద్ద కిడ్నాప్(indian origin man abducted in kabul) అయ్యారు. ఆయన కారుపై వెనుకనుంచి దాడిచేసి.. అరేందీని కిడ్నాప్ చేసినట్లు స్థానిక మీడియా సంస్థ తెలిపింది.
బన్సారీలాల్.. కాబుల్‌లో ఓ ఫార్మాకంపెనీని నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం 8గంటలకు అతని సిబ్బందితో కలిసి కంపెనీకి వెళ్తుండగా.. ఆయనపై దాడి చేసి.. కిడ్నాప్ చేసినట్లు ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ తెలిపారు. ఫార్మా సిబ్బందిని సైతం అపహరించాలని యత్నించగా.. వాళ్లు తప్పించుకున్నారని వివరించారు.