తెలంగాణ

telangana

ETV Bharat / international

పాలస్తీనా శరణార్థుల కోసం భారత్​ భారీ సాయం

పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనా శరణార్థులకు భారీ సాయం ప్రకటించింది భారత్​. వచ్చే రెండేళ్లలో ఐక్యరాజ్య సమితికి చెందిన రిలీఫ్​ అండ్​ వర్క్ ఏజెన్సీ (యూఎన్​ఆర్​డబ్ల్యూఏ)కు 10 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది.

By

Published : Jun 24, 2020, 8:21 AM IST

India pledges USD 10 million to UNRWA
పాలస్తీనా శరణార్థుల కోసం భారత్​ భూరీ విరాళం

పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనా శరణార్థుల కోసం పని చేసే ఐక్యరాజ్య సమితి రలీఫ్​ అండ్​ వర్క్​ ఏజెన్సీ (యూఎన్​ఆర్​డబ్ల్యూఏ)కి 10 మిలియన్​ డాలర్లు(రూ.75.61కోట్లు) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది భారత్​. వచ్చే రెండేళ్లలో ఈ నిధులను సమకూర్చనున్నట్లు తెలిపింది. నైపుణ్య శిక్షణ, మన్నికైన సంస్థలను నిర్మించటం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచటమే ఈ సహాయ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేసింది.

యూఎన్​ఆర్​డబ్ల్యూఏ నిధుల సమీకరణపై జరిగిన వివిధ దేశాల మంత్రుల సమావేశంలో ఈ సాయం ప్రకటించారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్​.

" పాలస్తీనా ప్రజలు తమ దేశం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి గౌరప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆతిథ్య దేశాలు, దాతలు, యూఎన్ఆర్​డబ్ల్యూఏల నిరంతర కృషిని భారత్​ అభినందిస్తోంది. కరోనా కేసులు పెరుగుతూ.. వైద్య సామగ్రికి దేశీయంగా డిమాండ్​ ఉన్నా ఔషధాలు, వైద్య సామగ్రిని అవసరమైన పలు దేశాలకు భారత్​ సాయంగా అందించింది. వచ్చే వారం నాటికి పాలస్తీనాకు వైద్య సామగ్రి, ఔషధాలను పంపిస్తాం. సాధారణ శిక్షణ కార్యక్రమాలతో పాటు పాలస్తీనా యువతకు ఏటా 250 మందికి ఉపకారవేతనాలు అందిస్తున్నాం. ప్రస్తుతం దాని విలువ 72 మిలియన్​ డాలర్లుగా ఉంది."

-మురళీధరన్​, విదేశాంగ శాఖ సహాయ మంత్రి.

యూఎన్​ఆర్​డబ్ల్యూఏకు మరింత మద్దతు అవసరమని పేర్కొన్నారు మురళీధరన్​. పలు దేశాలు తమ సహకారాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ.. భారత్​ సాయాన్నిపెంచిందని గుర్తు చేశారు. గతంలో 1.25 మిలయన్​ డాలర్లుగా ఉన్న సాయాన్ని 2018లో 5 మిలియన్​ డాలర్లకు పెంచినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 2 మిలియన్​ డాలర్లు అందించగా.. త్వరలోనే మిగతా 3 మిలియన్​ డాలర్లు చెల్లిస్తామని స్పష్టం చేశారు. వాటికి అదనంగా ఈ 10 మిలియన్​ డాలర్లు అందిస్తున్నట్లు ప్రకటించారు.

యూఎన్​ఆర్​డబ్ల్యూఏ ప్రకారం పశ్చిమాసియా ప్రాంతాల్లో సుమారు 5.6 మిలియన్​ మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు.

ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్‌.. ప్రపంచ దేశాల స్వప్నం

ABOUT THE AUTHOR

...view details