తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజా రాకెట్ల దాడికి ఇజ్రాయెల్​ ప్రతీకారం - యుద్ధ వాతావరణం

గాజా మిలిటెంట్లు ఇజ్రాయెల్​పై శనివారం 200 రాకెట్లతో దాడి చేశారు. వెనువెంటనే స్పందించిన ఇజ్రాయెల్​... గాజా నగరంపై వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు పాలస్తీనా వాసులు మరణించారు.

గాజా

By

Published : May 5, 2019, 7:25 AM IST

గాజా రాకెట్ల దాడికి ఇజ్రాయిల్​ ప్రతీకారం

ఇజ్రాయెల్​, గాజా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాజా మిలిటెంట్లు శనివారం 200 రాకెట్లతో ఇజ్రాయెల్​పై దాడికి తెగబడ్డారు. స్పందించిన ఇజ్రాయెల్ గాజా నగరంపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఒక గర్భిణీ, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఇజ్రాయెల్​తో కాల్పుల విరమణపై గాజాలోని హమాస్ మిలిటెంట్లు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలస్తీనా 200 రాకెట్లతో దాడి చేస్తే అందులో కొన్నింటిని తమ వైమానిక దళం తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఈ దాడిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఒక ఇల్లు దెబ్బతినగా మిగిలిన రాకెట్లు ఖాళీ ప్రాంతాల్లో పడ్డట్లు అధికారులు తెలిపారు. దాడితో సరిహద్దు ప్రాంతం మరోసారి రణ రంగాన్ని తలపించింది.

ఇదీ చదవండి: 'శ్రీలంక బాంబర్లకు కశ్మీర్, కేరళ​లో శిక్షణ!

ABOUT THE AUTHOR

...view details